- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
భవన నిర్మాణ అనుమతులు చూపండి.. జీడబ్ల్యూఎంసీ నోటీసులు
![భవన నిర్మాణ అనుమతులు చూపండి.. జీడబ్ల్యూఎంసీ నోటీసులు భవన నిర్మాణ అనుమతులు చూపండి.. జీడబ్ల్యూఎంసీ నోటీసులు](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348266-17.webp)
దిశ,వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. హనుమకొండ బాల సముద్రంలోని కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భవనానికి అనుమతులు లేవంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షులకు నోటీసులు జారీ చేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కాజీపేట సర్కిల్ నుండి ఈ నోటీసులు జూన్ 25వ తేదీన జారీ అయ్యాయి. నోటీసులు జారీ సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు జీడబ్ల్యూఎంసీ ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పార్టీ ఆఫీస్ కోసం ల్యాండ్ కేటాయింపు, బిల్డింగ్ పర్మిషన్ పత్రాలను మూడు రోజుల్లో అనుమతి పాత్రలు అందజేయాలని పేర్కొంది. లేదంటే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తందని మున్సిపల్ అధికారులు జారీ చేసిన నోటీసు లో పేర్కొన్నారు.