- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆర్టీసీ డీఎంకు ఏటూరునాగారం సర్పంచ్ హెచ్చరిక

దిశ, ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఆర్టీసీ పబ్లిక్ టాయిలెట్స్ శిథిలావస్థకు చేరి సెప్టిక్ ట్యాంక్ సైతం పూర్తిగా నిండి, మురుగు రోడ్డుపైకి వచ్చి దుర్గంధం వెదజల్లుతున్నదని ఏటూరునాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి అన్నారు. గురువారం సర్పంచ్ రామ్మూర్తి ఆర్టీసీ టాయిలెట్లని సందర్శించారు. ఆర్టీసీ డీఎంకి వినతిపత్రం అందజేసినా ఎలాంటి పనులు చేపట్టడం లేదని సర్పంచ్ రామ్మూర్తి అసహనం వ్యక్తం చేశారు. మురుగునీటిలో దోమలు ఏర్పడి ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఆర్టీసీ డీఎం స్పందించి, మేడారం ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తక్షణమే టాయిలెట్స్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజల ఆరోగ్య దృష్ట్యా గ్రామపంచాయతీ నిధుల నుండి టాయిలెట్స్ నిర్మాణం చేపట్టి, ఆ డబ్బులను ఆర్టీసీ డీఎం నుంచి రెండితలు వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ రంజిత్ కుమార్, పంచాయతీ ఈవో చందూలాల్, మాజీ ఎంపీటీసీ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.