ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేదే రంజాన్: ఎర్రబెల్లి ప్రదీప్ రావు

by Kalyani |
ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేదే రంజాన్: ఎర్రబెల్లి ప్రదీప్ రావు
X

దిశ, ఖిలా వరంగల్: ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించేదే రంజాన్ పండుగ అని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. శనివారం రంజాన్ పర్వదినం సందర్భంగా వరంగల్ మట్టేవాడ ఈద్గాలో చేసిన ప్రార్థనల్లో ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ సమాజంలో శాంతి, దానగుణం, కష్టసుఖాలను తెలిపేదే ఈ పవిత్ర రంజాన్ పండుగ అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ముస్లిం సోదర సోదరీమణులు అందరూ ఈ రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ఆ అల్లా కృపతో అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మతపెద్ద మొహమ్మద్ మసుద్, అహ్మద్ మైముది అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story