రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి : సీతక్క

by Disha Web Desk 23 |
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలి : సీతక్క
X

దిశ,కొత్తగూడ :మోడీ ప్రభుత్వం మనుధర్మ శాస్త్రాన్ని అనుసరిస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తుంది, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో కొత్తగూడ,గంగారం మండలాల్లో మంత్రి సీతక్క తో పాటు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ పర్యటించారు.ముందుగా గుంజేడు ముసలమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యెక పూజలు నిర్వహించారు. అనంతరం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంజేడు ముసులమ్మ దేవాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దాదాపు 200 కుటుంబాలను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లడుతూ పది సంవత్సరాల బీ జే పీ పార్టీ మోడీ పాలనలో దేశంలోని ప్రభుత్వ రంగాలను అమ్మకాలకు పెట్టి మోడీ దోస్తులు అయిన అంబానీ, అదానిలకు దోచిపెడుతుందని అన్నారు. కనీసం పేదలు వాడే అటువంటి నిత్యావసర వస్తువుల పై కూడా జీ ఎస్ టీ రూపంలో పన్నులు వసూలు చేస్తూ పేదల నడ్డి విరుస్తుందని దువ్వబట్టారు. బీ జే పీ నాయకులు దేశ ప్రజల బలహీనతను వాడుకుంటూ దేవుడిని అడ్డుపెట్టుకొని మత రాజకీయాలు చేస్తూ హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెడుతుందని వాపోయారు. భారత దేశం అంటేనే లౌకిక రాజ్యం అంబేద్కర్ రచించిన లౌకిక రాజ్యాన్ని తుడిచిపెట్టడానికి రాజ్యాంగం మార్చేందుకు మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది దేశం అంతా కాంగ్రెస్ గాలి వీస్తుంది కేంద్రంలో కాంగ్రెస్ పాలన రాబోతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడని భరోసా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటిలను ప్రజలు ఆదరిస్తున్నారని ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు చేస్తూ కారు కూతలు కుస్తుందని అన్నారు.

అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కాకముందే ఆరు గ్యారంటీలతో పాటు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలువబోతున్నారని మీ అమూల్యమైన ఓటు చేతు గుర్తుకి వేసి భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్, కొత్తగూడ, గంగారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు,సీనియర్ రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి, లావణ్య వెంకన్న, బ్లాక్ అధ్యక్షుడు మొగిలి, జడ్పీటీసీ లు పుల్సాము పుష్పలత శ్రీనివాస్, ఈసం రమ సురేష్, ఎంపీపీ విజయ రూప్ సింగ్,యూత్ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, ఎంపీటీసీ లు, మాజీ సర్పంచ్లు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Next Story

Most Viewed