- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గార్లలో వింత ఘటన.. బాలిక కంట్లో నుంచి ప్లాస్టిక్, ఇనుప ముక్కలు (వీడియో)
దిశ, గార్ల: ఆరుబయట కనపడే ప్లాస్టిక్, ఇనుము, పేపర్ ఓ చిన్నారి కంటి నుండి రావడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒక్కొక్క వస్తువు కంటి నుండి జారీ పడుతుండంతో చిన్నారి తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఈ సంఘటన వివరాలలోకి వెళ్లితే.. కురవి మండలం రాజోలు గ్రామ పంచాయతీకి చెందిన భూక్య దశ్రు-దివ్య దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో రెండవ సంతానం సౌజన్య(7) . ఈ సౌజన్య చిన్నప్పటి నుండే అమ్మమ్మ గారి ఊరైన గార్ల మండల పెద్ద కిష్టపురం గ్రామంలో ఉంటోంది.
ఇదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. ఆటపాటలతో సరదాగా గడుపుతున్న సౌజన్యకు ఓ వింత రోగం దాపురించింది. చిన్నప్పటి నుండి బాగానే ఉన్నా సౌజన్యకు సరిగ్గా మూడు నెలల క్రితం కంటి నొప్పి వచ్చి కంట్లో నుండి పత్తి గింజ పడింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అప్పటి నుండి ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉంది.
కానీ శనివారం తెల్లవారుజామున మళ్ళీ ఒక్కసారిగా కంట్లో నుండి పేపర్, ప్లాస్టిక్, ఇనుము, బియ్యం గింజలు, చీపురు పుల్లలు, చేతి గోర్లు ముక్కలు పడ్డాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు, చుట్టపక్కల వాళ్ళు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా బాధితురాలి తల్లిదండ్రులు, బంధువులు మాట్లాడుతూ.. తమ బిడ్డకు వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtube.com/shorts/rhVnaZhnLHs?feature=share