- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్లబెల్లం, పటిక వ్యాపారిపై పీడీ యాక్ట్ నమోదు..
దిశ, ఐనవోలు (వర్ధన్నపేట): నల్లబెల్లం, పటిక వ్యాపారిపై పీడీ యాక్ట్ నమోదైన ఘటన వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో జరిగింది. రాయపర్తి మండల గోప్యతండాకు చెందిన భూక్య వీరన్న అక్రమంగా నల్లబెల్లం, పటిక వ్యాపారాలు చేస్తూ గుడుంబా తయారీదారులకు సరఫరా చేస్తాడు. దీంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నందున భూక్య వీరన్నపై వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేసి చర్లపల్లి జైలుకి తరలించినట్లు వర్ధన్నపేట ఎక్సైజ్ సీఐ పవన్ తెలిపారు.
భూక్య వీరన్నపై వరంగల్ మహబూబాబాద్, నల్లగొండ జిల్లాలలోని పలు ఎక్సైజ్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎన్నిసార్లు హెచ్చరించినా నేరాలను మానుకోలేదని తెలిపారు. వర్ధన్నపేట స్టేషన్ పరిధిలో గతంలో వరంగల్ కు చెందిన బెల్లం వ్యాపారి ఆకుల రాజేందర్ పై కూడా పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. స్టేషన్ పరిధిలోని వర్ధన్నపేట, సంఘెం, రాయపర్తి, పర్వతగిరి మండలాలలో కొందరు అక్రమ నల్లబెల్లం, గుడుంబా వ్యాపారులపై నిఘా పెట్టామని, అక్రమ వ్యాపారాలు మానుకోకపోతే వారిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.