HCU Land Dispute : హెచ్సీయూ విద్యార్థులపై కేసుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు

by M.Rajitha |
HCU Land Dispute : హెచ్సీయూ విద్యార్థులపై కేసుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు
X

దిశ వెబ్ డెస్క్ : కంచ గచ్చిబౌలి భూవివాదం(Kancha Gachibouli Land Issue)పై ప్రభుత్వం మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి హెచ్సీయూ భూముల వివాదం(HCU Land Despute)లో అరెస్టైన విద్యార్థులను(Studnets Release) విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan), మంత్రుల కమిటీతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం, ప్రజా సంఘాల ప్రతినిధుల బృందం నిర్వహించిన భేటీలో డిప్యూటీ సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాంపస్ లో ఉన్న పోలీసు బలగాలను ఉపసంహరించాలని, నిషేధాజ్ఞలు తొలగించాలని, అరెస్టైన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్లు మంత్రుల కమిటీ ముందు ఉంచగా.. విద్యార్థుల కేసులపై సానుభూతితో సమీక్షిస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది.

సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు వివాదాస్పద భూమిలో బందోబస్తు కొనసాగుతుందని వెల్లడించారు. అలాగే 400 ఎకరాల్లో నష్టం అంచనాకు, జీవ వైవిధ్య సర్వేకు అనుమతి కోరగా.. కోర్టు తీర్పు పెండింగ్ లో ఉన్నప్పుడు ఎలాంటి సర్వేకు అనుమతి ఇవ్వలేమని తెలియజేశారు. కాగా ఈ భూముల వివాదంలో అరెస్టయి, ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మిగతా విద్యార్థులపై ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకుంటామని పేర్కొన్నారు.



Next Story

Most Viewed