- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral video : వావ్.. అదిరిపోయే ఫీచర్లతో యాపిల్ బ్యాక్ ప్యాక్ స్ట్రీట్ వ్యూ కెమెరా..!

దిశ, ఫీచర్స్ : గూగుల్ మ్యాప్ గురించి అందరికీ తెలిసిందే. మనకు తెలియని అడ్రస్‌కు చేరుకోవడానికి, వివిధ ప్రాంతాల గురించి సెర్చ్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఓలా, ఉబర్ వంటి ట్యాక్సీలు సైతం దీని ఆధారంగానే ప్యాసింజర్లకు సేవలు అందిస్తుంటాయి. స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ ఇది అందుబాటులో ఉంటోంది. దీంతో ఇప్పుడు తెలియని ప్రాంతం, తెలియని అడ్రస్ వంటివి క్షణాల్లో తెలుసుకునే అవకాశం ఏర్పడింది. అయితే కొన్నిసార్లు మారుమూల ప్రాంతాల్లో, నగరాల్లో గల వీధుల్లోని రోడ్లు, అరుదైన నివాసాల గురించి ఎర్రర్స్ కూడా చూపిస్తుంటాయి. కాబట్టి అలాంటి పరిస్థితులను సైతం అధిగమించేందుకు ‘యాపిల్ మ్యాప్స్’ పేరుతో బ్యాక్‌పాక్ స్ట్రీట్ వ్యూ కెమెరా(Apple Backpack Street View Camera)ను అందుబాటులోకి తెచ్చారు ఆ కంపెనీ నిపుణులు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ సమాచారం ప్రకారం.. ఓ వ్యక్తి యాపిల్ బ్యాక్ ప్యాక్ స్ట్రీట్ వ్యూ కెమెరాను వీపున తగిలించుకొని సింగపూర్ రోడ్లపై నడుస్తున్నారు. స్ట్రీట్ లెవెల్ మ్యాపింగ్ సామర్థ్యాలను విస్తరించేందుకే ఇలా చేస్తున్నట్లు ఈ వీడియోను బట్టి తెలుస్తోంది. కాగా ఈ యాపిల్ బ్యాక్ ప్యాక్ బాక్స్ ప్రత్యేక కెమెరాలు, సెన్సార్లతో తయారు చేయబడి ఉన్నందున అది ఆన్ గ్రౌండ్ మ్యాపింగ్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. పైగా ఇందులో హై రిజల్యూషన్ ఇమేజరీతోపాటు వీధులు, పలు పబ్లిక్ ప్లేస్‌లను 3D డేటా (3D data) రూపంలో సంగ్రహించడానికి (to summarize) అనుకూలమైన టెక్నాలజీ ఇమిడి ఉందని పేర్కొంటున్నారు. ఈ న్యూ సరికొత్త డెవలప్‌మెంట్ యాపిల్, గూగుల్(Apple, Google) వంటి, ఇప్పటికే అందుబాటులో ఉన్న స్ట్రీట్ వ్యూ సేవలకు మెరుగులు దిద్దుతాయి. నిరంతరం అప్డేట్ చేస్తూ, సమర్థవంతమైన సేవలు అందించడంలో సహాయపడటానికి యూజ్ అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.