RTC Strike : తెలంగాణలో మే 6 నుంచి ఆర్టీసీ సమ్మె

by M.Rajitha |
RTC Strike : తెలంగాణలో మే 6 నుంచి ఆర్టీసీ సమ్మె
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఆర్టీసీ ప్రత్యక్ష సమ్మె(Telangana RTC Strike)కు శంఖం పూరించింది. మే 6 నుంచి ఆర్టీసీ సమ్మె ఉంటుందని ఆర్టీసీ జేఏసీ(RTC JAC) కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్(RTC MD Sajjanar), లేబర్ కమిషనర్‌కు సమ్మె నోటీసులు జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మే 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ వెల్లడించింది. కాగా జనవరి 27న తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని ఇదివరకే ఆర్టీసీ జాక్ సంస్థకు నోటీసులు ఇచ్చింది. సమ్మెకు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె నిర్వహించేందుకే సిద్ధం అయింది. ఈ మేరకు సోమవారం లేబర్ ఆఫీసులో సమావేశం అయిన నేతలు.. మే 6 నుంచి సమ్మె చేసేందుకు తేదీ నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే ఎంతదూరం అయినా వెళ్తామని హెచ్చరించారు. కాగా తమ సమ్మెకు మహిళాసంఘాలు, ప్రజాసంఘాలు, అన్ని యూనియన్లు కలిసిరావాలని వారు కోరుతున్నారు.

Next Story

Most Viewed