నడవలేని స్థితిలో టాలీవుడ్ నటుడు.. కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్

by Hamsa |
నడవలేని స్థితిలో టాలీవుడ్ నటుడు.. కారణం ఇదేనంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు ఆదర్శ్ బాలకృష్ణ(Adarsh ​​Balakrishna) ‘హ్యాపీడేస్’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వినాయకుడు, మా అన్నయ్య బంగారం(Maa Annayya Bangaram), జీనియస్, బాడీగార్డ్, గోవిందుడు అందరివాడేలే, సరైనోడు, రంగ మార్తాండ, కలర్ ఫొటో వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు. అలాగే పలు హిందీ, కన్నడ, ఓటీటీ సినిమాల్లోనూ ఆదర్శ్ నటించాడు. అంతేకాకుండా తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. కానీ విన్నర్ కాలేకపోయాడు రన్నరప్‌గా నిలిచాడు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ నటుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. అయితే ఇటీవల ఆదర్శ్ ఓ రోడ్ ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం.

దీంతో ఆయనకు మోకాలి దగ్గర గాయం అవడంతో సర్జరీ చేయించుకున్నాడు. తాజాగా, ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదర్శ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో ఆయన నడవలేని స్థితిలో కనిపించారు. ఓ కర్ర సాయంతో నడుతూ తన పరిస్థితిని వివరించారు. అలాగే ‘‘నా మొదటి 10 రోజులు ACLలో నెలవంకకు చూశాను. ఆ తర్వాత ఒక ఊతకర్ర, ఒక జర్నల్, కొన్ని పుస్తకాలు, నా ల్యాప్‌టాప్, వెయిటింగ్ స్కేల్, మొత్తం ప్రోటీన్‌ ఉన్న ఫుడ్ తిని బతికేశా. ఊపిరి పీల్చుకోండి, ఊపిరి పీల్చుకోండి. కండరాలు పైకి, కొవ్వు తగ్గుతుంది. సర్జరీ వల్ల ఇవన్నీ చేయాల్సి వస్తుంది’’ అనే క్యాప్షన్ జత చేశాడు.ప్రస్తుతం ఆదర్శ్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు త్వరగా కోలకుని స్ట్రాంగ్‌గా మళ్లీ సినిమాల్లో నటించాలని కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed