ఈ మైనార్టీ పాఠశాల మా కొద్దు..విద్యార్థినుల తల్లిదండ్రులు

by Sumithra |
ఈ మైనార్టీ పాఠశాల మా కొద్దు..విద్యార్థినుల తల్లిదండ్రులు
X

దిశ, డోర్నకల్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థినీలకు సరైన వసతులు లేవంటూ విద్యార్థునిల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మైనార్టీ హాస్టల్లో భోజనం, త్రాగునీరు, మరుగుదొడ్లు లేక తమ పిల్లలు అవస్థలు పడుతున్నారని భావోద్వేగానికి లోనయ్యారు. 500 మంది విద్యార్థినీలకు ఐదు మరుగుదొడ్లు ఎలా సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. తాగడనికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారని అంటున్నారు. ఆదివారం తమ పిల్లలను చూడడానికి వస్తే తమ పిల్లలు మంచినీళ్ల బాటిల్లు కొనకరమ్మని చెప్పడం తమ హృదయాలను కలిసి వేసిందని వాపోయారు.

గత ఏడాది ఇదే పాఠశాల,హాస్టల్ కురివిలో నిర్వహించినప్పుడు చాలా చక్కటి వసతులు ఉండేవన్నారు.డోర్నకల్ కు తరలించి తమ పిల్లల జీవితాలతో అధికారులు ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే రెడ్యానాయక్, కొంతమంది అధికార పార్టీ నాయకులు పట్టుబట్టి డోర్నకల్ కి తరలించి తమ పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారని మండిపడ్డారు. పాఠశాలను ఇక్కడికి తరలించిన నాయకుల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తారు.తమ పిల్లలు చాలీచాలని సౌకర్యాల నడుమ విష పురుగుల మధ్య చదువుకోవాలని ప్రశ్నించారు.నిత్యం పాములు పడక గదుల్లోకి వస్తున్నాయని పిల్లలు బెంబేలెత్తుతున్నారు. బాత్రూం నీళ్లనే మంచినీళ్లుగా తాగమని అంటున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు.

ఈ వాతావరణంలో తమ పిల్లల్ని ఉంచమని బాలికల తల్లులు కరాకండిగా చెబుతున్నారు.ఎమ్మెల్యే రెడ్యా నాయక్ పై నిప్పులు చెరిగారు.ఎమ్మెల్యే వాళ్లనే ఈ ప్రాంతం ఇలా అయిందని ఆరోపించారు.పాఠశాలను కురవికి తరలించాలని నినాదాలు చేశారు.ఓ విద్యార్థిని తల్లి ఆందోళనలో అస్వస్థకు గురయ్యారు.హుటా హుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డుపైకి చేరిన తల్లిదండ్రులు ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.మైనార్టీ నాయకుడు అఖిల్ లుల్లా మొబైల్ ఫోన్ గుంజుకొని దాడికి పాల్పడ్డారు.పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థిని తల్లిదండ్రులకు నచ్చ చెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.

మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్ పుష్పజా రెడ్డి మాట్లాడుతూ.. గత సంవత్సరం వరకు పాఠశాలలో విద్యార్థినిలు చక్కటి విద్యను అభ్యసించారు. మంచిగా నడిచే పాఠశాలను ఎమ్మెల్యే రెడ్యానాయక్, స్థానిక మైనార్టీ నాయకుల ప్రోత్బలంతో డోర్నకల్ మండల కేంద్రానికి తరలించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పిల్లల తల్లిదండ్రులు మొదటి రోజు నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాత్కాలికంగా మున్సిపాలిటీ నీటిని ఉపయోగిస్తున్నాము.సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేస్తానని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed