MLA Revuri: పంచాయతీ కార్యదర్శులే నా బలం బలగం

by Kalyani |
MLA Revuri: పంచాయతీ కార్యదర్శులే నా బలం బలగం
X

దిశ,గీసుగొండ: ప్రజలకు సేవలు అందించడానికి పంచాయతీ కార్యదర్శులు నా బలం బలగం అని,కానీ వారే తన బలహీనతగా మారడం బాధాకరమని ఎమ్మెల్యే రేవూరి అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్యదర్శుల పనితీరు ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి ఉంటుందన్నారు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయా గ్రామ కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. గత సమీక్షా సమావేశంలో ఉన్న సమస్యలను ఇప్పటి వరకు పరిష్కరించక పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వీధి దీపాల నిర్వహణ,మంచినీటి సరఫరా సరిగా లేదన్నారు. సమీక్ష సమావేశానికి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గైర్హాజరు అవడంతో ఆగ్రహించి, ఇంచార్జ్ ఎంపీడీవోని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ద్వారా సంజాయిషి ఇవ్వాలని ఆదేశించారు. రాజకీయ ఒత్తిడిలు లేని సమయంలో బాధ్యతగా వ్యవహరించి గ్రామాలను అభివృద్ధి పరచడం మరిచి పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,మండల స్థాయి అధికారులు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.

ప్రతి గ్రామంలో కచ్చితంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేసి, గ్రంథాలయ కమిటీలను నియమించాలని గ్రంథాలయ నిర్వహణకై గ్రామంలోని ఎన్నారై లను,గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత అధికారులను సమన్వయం చేసి నిధులను సమీకరించాలని కార్యదర్శులను ఎమ్మెల్యే ఆదేశించారు.రెండు మూడు రోజులలో గ్రామాలలోని అన్ని సమస్యలను పరిష్కరించి,తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఎంపీడీఓ,ఎంపీఓలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే నా దృష్టికి తీసుకువచ్చి, నా సేవలను వాడుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఎంపీడీవో కమలాకర్ ఎంపీఓ ఆడేపు ప్రభాకర్, వ్యవసాయ అధికారి హరి ప్రసాద్, పశు వైద్యాధికారులు మోహన్ రెడ్డి,గైని శ్రీనివాస్, పిఆర్ ఏఈ సుధాకర్, ఏపీవో చంద్రకాంత్, గ్రామ కార్యదర్శిలు పాల్గొన్నారు.

Advertisement

Next Story