- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
కీ చైన్ మింగిన చిన్నారి.. ఆ టెక్నిక్‌తో ఆపరేషన్ లేకుండా కాపాడిన డాక్టర్స్
దిశ, వెబ్‌డెస్క్: చిన్నపిల్లలకు తినే వస్తువేదో, ఆడుకునే వస్తువేదో తెలియదు. అందుకే వాళ్లు చాలాసార్లు ఆడుకునే వస్తువులను నోట్లో పెట్టుకుంటుంటారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా కొంతమంది చిన్నారులు వాటిని మింగేయడం వల్ల ప్రాణాలే పోగొట్టుకుంటుంటారు. కానీ వారిలో కొంతమందిని డాక్టర్లు తమ సమయస్ఫూర్తితో కాపాడిన సంఘటనలూ లేకపోలేదు. తాజాగా గుజరాత్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. అహ్మదాబాద్‌లో మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ అనుకోకుండా కీ చైన్ మింగేసింది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా గమనించలేదు. అయితే కొద్ది రోజులకు చిన్నారి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు హడావుడిగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు వెంటనే చిన్నారికి ఎక్స్‌రే తీసి కడుపులో ఏదో మెటల్ ఆబ్జెక్ట్ ఉన్నట్లు గురించారు. ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు కూడా షాక్ అయ్యారు.
అయితే దీనికి ముందుగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు భావించినా.. చివరికి ఓ సరికొత్త ఐడియాతో ఆపరేషన్ అవసరం లేకుండానే కీ చైన్‌ను బయటకు తీసేశారు. డాక్టర్ ఆశ్రయ్ షా ఆధ్వర్యంలోని బృందం టెలిస్కోప్ సాయంతో విజయవంతంగా కీ చైన్ బయటకు తీసి చిన్నారి ప్రాణాలను కాపాడింది. దీంతో చిన్నారికి ఆపరేషన్ అవసరం లేకుండా పోయింది.
రాజస్థాన్‌లో కూడా..
గత ఏడాది రాజస్థాన్‌లో కూడా ఇలాంటి ఉదంతం వెలుగులోకి వచ్చింది. కిరౌలీ ప్రాంతంలో మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ రూపాయి నాణెం మింగింది. రాత్రి నిద్రిస్తున్న చిన్నారికి వాంతులు రావడంతో కుటుంబసభ్యులు ఉదయం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చిన్నారికి ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించి ఆమె గొంతులో రూపాయి నాణెం ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. ఆ సమయంలో కూడా వైద్యులు టెలిస్కోప్ సాయంతోనే గొంతులోని నాణేన్ని బయటకు తీసి చిన్నారి ప్రాణాలు కాపాడారు.