- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Panchayat Elections : పంచాయతీల ఎన్నికలపై కసరత్తు ప్రారంభం
దిశ, కాటారం : పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికలకు సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జనవరి నెలలోనే సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది ఈ సమయంలోనే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం జిల్లా అధికారుల నుంచి వివరాలు సేకరించారు. నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రత్యేక సమీక్షలో అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ దిశగా ఏర్పాటులను మొదలుపెట్టింది.
గ్రామపంచాయతీలో వార్డు మ్యాపింగ్, వార్డుల వారీగా ఓట్ల జాబితా తయారీ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్ల (డీఈఓ )శిక్షణ షెడ్యూల్ను శనివారం రాత్రి ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రతి జిల్లా నుంచి ఐదుగురు ఆపరేటర్ల ను ఎంపిక చేసి వివరాలు పంపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన మాస్టర్ ట్రైనర్లకు ఆగస్టు రెండవ తేదీన ఉదయం పదిన్నర గంటలకు హైదరాబాదులోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి) లో శిక్షణ అందించనుంది వీరు తిరిగి ఆయా జిల్లాలోని మండలాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు శిక్షణ అందించాల్సి ఉంటుంది.
గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే
గ్రామపంచాయతీల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 1 న సర్పంచులు పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. అదే నెల రెండు నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. ప్రత్యేక అధికారులు తమ శాఖపరమైన సొంత విధులతో పాటు పంచాయతీల్లో సర్పంచుల స్థానంలో అదనంగా పనిచేయాల్సి రావడంతో పాలన పట్టు తప్పిందని విమర్శలు ఉన్నాయి. ఒక్కో అధికారికి నాలుగైదు పంచాయతీలు అప్పగించడంతో వీరు గ్రామాలకు చుట్టపు గా వచ్చి వెళుతున్నారని విమర్శలున్నాయి. ఈ కారణంగా పల్లెల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. పంచాయతీలకు సకాలంలో నిధులు అందడం లేదని నిర్వహణ ఖర్చులకోసం అప్పులు చేస్తున్నామని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలక వర్గాలు ఉంటే వెనువెంటనే సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకునేందుకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఆగస్టు ఒకటి తో ముగియనున్న ప్రత్యేక పాలన..
గ్రామ పంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారుల పాలన ఆగస్టు 1వ తేదీతో ఆరు నెలలు ముగియనుంది. ఆ తర్వాత మళ్లీ పొడగింపును ఇవ్వనున్నారు. ఎన్నికలు జరిగేంత వరకు ప్రత్యేక అధికారులను కొనసాగించనున్నారు. ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్ణయం తీసుకొని నిర్వహిస్తే మొదట పంచాయతీలను పూర్తి చేసిన తర్వాత మండల, జడ్పీ ఎన్నికలను నిర్వహించనుంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ లిస్ట్ తో పాటు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. సీఎం ఎన్నికలపై ప్రకటన చేయడంతో ఆయా పార్టీల నేతల్లో కదలిక మొదలు కాగా , ప్రభుత్వం దీపావళి లోపు బీసీ గణన పూర్తి చేసి రిజర్వేషన్లను తయారు చేస్తే ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. రిజర్వేషన్ నిర్ణయం ఆలస్యమైతే మరి కొంతకాలం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగే అవకాశం ఉంది.