- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మా టీచర్స్ రావాలి.. క్లాసెస్ జరగాలి.!
దిశ, మరిపెడ : మా టీచర్స్ రావాలి..క్లాసెస్ జరగాలి అంటూ మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండల కేంద్రం లోని కస్తూర్బా వసతి గృహం గేటు వద్ద విద్యార్థునులు నిరసనకు దిగారు. ఎస్ ఎస్ ఏ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ సమ్మె చేస్తుండడంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాటుగా కొంతమంది టీచర్లకు కస్తూర్బా లో విధులు నిర్వహించమని ఆదేశించారు. ఐనప్పటికీ పూర్తిస్థాయిలో క్లాసులు జరగడం లేదంటూ 18 రోజుల నుండి కేవలం రెండే క్లాసులు చెప్పారని పదవ తరగతి పరీక్షలు త్వరలోనే ఉన్నాయని రాత్రి వేళలో భయాందోళనకు గురవుతున్నామని మా పరిస్థితి ఏంటి అని విద్యార్థునులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చదువు చెప్పడం ఇక్కడ చెప్పడం మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది అయినప్పటికీ మీరు అర్థం చేసుకోవాలంటూ ప్రైమరీ స్కూల్ టీచర్లు విద్యార్థునులకు నచ్చ చెప్పినప్పటికీ ససేమిరా అంటూ నాలుగైదు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. చివరకు జి సి డి ఓ విజయ్ కుమారి కలుగజేసుకుని విద్యార్థులకు నచ్చ చెప్పడం జరిగింది. అ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది తల్లిదండ్రులు సైతం విద్యార్థునుల భవిష్యత్తును ఆగం చేయొద్దంటూ టీచర్ల ను వేడుకోవడం అక్కడున్న అందరిని కలచివేసింది.