అభివృద్ధి చూడ‌లేని క‌ళ్లున్న క‌బోదులు ప్ర‌తిప‌క్షాలు : ప్రభుత్వ చీఫ్ విప్

by Dishaweb |   ( Updated:2023-08-22 10:01:15.0  )
అభివృద్ధి చూడ‌లేని క‌ళ్లున్న క‌బోదులు ప్ర‌తిప‌క్షాలు : ప్రభుత్వ చీఫ్ విప్
X

దిశ, హనుమకొండ టౌన్ : వ‌రంగ‌ల్ ప‌శ్చిమ శాస‌న‌స‌భ అభ్య‌ర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తనపేరును ప్ర‌క‌టించినందుకు ప్రభుత్వ చీఫ్ విప్ ,బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షులు కేటీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇన్నాళ్ల నా రాజ‌కీయ జీవితంలో అండ‌గా నిలిచిన తెలంగాణ వాదులు, గులాబీ శ్రేణులు బుద్ధిజీవుల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. 2005 నుంచి నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌గా ప‌ని చేస్తున్నాను. నాడు కార్పొరేట‌ర్ గా పార్టీ బీఫాం ఇస్తే గెలిచి వ‌చ్చాను. 2009లో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పార్టీ నిలిపితే గెలిచి ఉద్య‌మ స‌మ‌యంలో కొట్లాడాను. తెలంగాణ వ‌చ్చాక 2014, 2018లో పార్టీ అభ్య‌ర్థిగా అవ‌కాశం, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు, గులాబీ శ్రేణుల కృషితో గెలుపొందాను. రానున్న రోజుల్లో అంద‌రిని క‌లుపుకొని వెళ్తు మ‌ళ్లీ గెలిచి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల సేవ‌కు పున‌రంకిత‌మ‌వుతా.2009 ఉద్య‌మ స‌మ‌యంలో ఉమ్మ‌డి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున ప్రాతినిధ్యం వహిస్తూ ఉద్య‌మాన్ని ముందు ఉండి న‌డ‌ప‌డం జ‌రిగింది.

అదే స‌మ‌యంలో న‌గ‌ర అభివృద్ధి కోసం ప్ర‌త్యేకంగా కాజీపేట బ్రిడ్జి నిర్మాణం కోసం నాటి ముఖ్య‌మంత్రి రోష‌య్య‌, త‌ర్వాతి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డిల‌ను నిధుల గురించి అడ‌గ‌గా, వారు ఒక్క రూపాయి విదిల్చింది లేదు. కానీ తెలంగాణ వ‌చ్చాక ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాజీపేట బ్రిడ్జి నిర్మాణం కోసం 75 కోట్లు మంజూరు చేశారు. ఆ ప‌నులు తుది ద‌శ‌కు చేరాయి అన్నారు. నాడు జిల్లా కేంద్రంలో కేవ‌లం ఒక ప‌బ్లిక్ గార్డెన్ మాత్ర‌మే ఉండ‌గా నేడు న‌గ‌రంలోని అన్ని డివిజ‌న్ల‌లో పార్కుల‌ను ఏర్పాటు చేశాం. భ‌ద్ర‌కాళీ ట్యాంక్ బండ్, చిల్ర‌డ్న్స్‌ పార్క్, పెట్ పార్క్, జ‌య‌శంక‌ర్ పార్క్‌ వంటి పార్కుల‌ను అభివృద్ధి చేశాం. వ‌డ‌వాడ‌లా సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాం. గ్రంథాల‌యానికి నిధులు తెచ్చాం. కాళోజీ క‌ళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నాం. మ‌న బ‌డి మ‌న బాధ్య‌త పేరుతో పాఠ‌శాల‌ల‌ను అభివృద్ధి చేసిన మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న కృషి చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు రుణ విముక్తి కమిషన్ చైర్మన్ నగుర్ల వెంకటేశ్వర్లు, కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్, లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed