- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హన్మకొండలోనూ CMR షాపింగ్ మాల్.. సందడి చేసిన సినీ తార రాశీఖన్నా
దిశ, వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ CMR షాపింగ్ మాలు. ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ హన్మకొండ నయీంనగర్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. సీఎమ్‌ఆర్ నూతన షాషింగ్ మాల్‌ను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సుందర్ రాజు, వరంగల్ 6వ డివిజన్ కార్పొరేటర్ చెన్నం మధుసూదన్, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, రైస్ మిల్లర్స్ యజమాని, బియ్యం ఎగుమతి వ్యాపారి, మొదటి కొనుగోలు శ్రీ ఎన్. రామ్మూర్తి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వస్త్ర ప్రపంచంలో రారాజు సి.ఎం. ఆర్. హనుమకొండకు రావటం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి సంస్థలు హన్మకొండకు రావటంతో నగరం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎమ్ఆర్ షాపింగ్ మాల్ నిర్మాణంతో మరిన్ని సంస్థలు హన్మకొండకు వస్తాయన్నారు. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయన్నారు.
సి.ఎం.ఆర్. ఫౌండర్ & చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వస్త్ర సౌరభం హన్మకొండలో లభిస్తుందని, ప్రజలు అన్ని రకాల వేడుకలకు అతి తక్కువ ధరలకే వస్త్రాలు అందిస్తుందని చెప్పారు. సొంతంగా మగ్గాలపై నేయించిన వస్త్రాలను అందుబాటులో ఉంచుతున్నామన్నామన్నారు. తమలా మరెవ్వరూ ఇవ్వని ధరలకు సీఎమ్ఆర్ షాపింగ్ మాల్‌లో వస్త్రాలు లభిస్తున్నాయని చెప్పారు.
సీఎమ్‌ఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ తమ 26వ షోరూంను హన్మకొండలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు, సి.ఎం.ఆర్. అంటే "ది వన్ స్టాప్ షాప్" అని చెప్పారు. ఫ్యామిలీలో అందరికీ నచ్చే విధంగా అన్ని రకాల స్టైల్స్, డిజైన్స్ లభిస్తాయన్నారు. అన్ని వర్గాలకు అందుబాటు ధరలలో లభించే విధంగా లక్షల్లో డిజైన్లు, వేలల్లో వెరైటీలు లభిస్తాయన్నారు.
అంతకుముందు సినీ తార రాశీ ఖన్నా సందడి చేశారు. అన్ని ఫ్లోర్లు అంతా కలియతిరుగుతూ తనదైన శైలిలో ప్రజలను, వినియోగదారులను, అభిమానులను, ఆకట్టుకునే విధంగా హావభావాలతో సందడి చేశారు. మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి తనదైన శైలిలో మిమిక్రీ చేస్తూ జనాకర్షణ చేశారు.