Crop Loan:పట్టా పాస్ బుక్ ఒకరిది..క్రాప్ లోన్ డబ్బులు వేరొకరి అకౌంట్లో!?

by Jakkula Mamatha |   ( Updated:2024-08-02 03:12:27.0  )
Crop Loan:పట్టా పాస్ బుక్ ఒకరిది..క్రాప్ లోన్ డబ్బులు వేరొకరి అకౌంట్లో!?
X

దిశ,గూడూరు:కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ రైతులలో ఆనందం నిండిన గూడూరు మండలం లోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బోడ వీరన్న అనే రైతుకు మాత్రం బాధే మిగిలింది. పూర్తి వివరాల్లోకి వెళితే..గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు బోడ వీరన్న కు అదే గ్రామానికి చెందిన బానోత్ లక్ష్మణ్ గూడూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్‌లో పట్టా పాస్ బుక్ ద్వారా క్రాప్ లోన్ ఇప్పిస్తానని చెప్పి 2023 వ సంవత్సరంలో పట్టా పాస్ పుస్తకాలు తీసుకున్నాడు. సంవత్సరం దాటిన లోన్ రాలేదు అని పట్టా పాస్ బుక్ లు ఇవ్వమని వీరన్న లక్ష్మణ్‌ను అడిగితే ఇస్తా అని దాట వేస్తూ వస్తున్నాడు.

గత 2 రోజుల కింద బోడ వీరన్న ఫోన్ కు 60000 రూపాయలు రుణమాఫీ అయినట్టుగా మెసేజ్ రావడంతో ఒక్క సరిగా అవాక్కాడు. గూడూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్‌కు వచ్చి పూర్తి వివరాలు ఆరా తీయగా గతంలో పని చేసి బదిలీపై వెళ్లిన బ్యాంక్ మేనేజర్ మరియు లక్ష్మి పురం గ్రామానికి చెందిన బానోత్ లక్ష్మణ్ నా ప్రమేయం లేకుండా సుమారు 60 వేల రూపాయలు ఫోర్జరీ సంతకాలతో క్రాప్ లోన్ తీసుకొని మోసం చేశారని సదరు రైతు ఆరోపిస్తున్నారు. ఫోర్జరీ సంతకాలతో వ్యక్తీ లేకుండా లోన్ ఎలా ఇచ్చారు అని బ్యాంకు సిబ్బందిని నిలదీశారు. తమకు న్యాయం చేయవలసిందిగా రైతు బోడ వీరన్న డిమాండ్ చేశారు ఇలా రైతుల ప్రమేయం లేకుండా ఇంకా ఎన్ని లోన్లు తీసుకున్నారు అని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed