వచ్చే ఐదు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి

by Sridhar Babu |
వచ్చే ఐదు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వచ్చే ఐదు రోజులు మరింత వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు జిల్లా స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు, పాఠశాలలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాలను గుర్తించి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

నూతనంగా ఏర్పాటు చేయబోయే రెవెన్యూ యాక్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో 23 లేదా 24 తేదీలలో మేధావులు, సీనియర్ సిటిజన్స్, సీనియర్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్, ధరణి దరఖాస్తులు అధిక శాతం పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిశీలించి అర్హత గల దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమోదించాలన్నారు. ప్రత్యేక బృందాలను నియమించి రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, సంబంధిత సిబ్బంది ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వెంటవెంటనే

పరిశీలించి సరైన వాటిని పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, ఎల్ఆర్ఎస్ లకు సంబంధించి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని మంత్రి కోరారు. మహబూబాద్ జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మందిరం నుండి అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) రెవెన్యూ లెనిన్ వత్సల్ టోప్పో, ఎం.డేవిడ్, మహబూబాబాద్ ,తొర్రూర్, ఆర్డీఓలు అలివేలు, నరసింహారావు, డీపీఓ హరిప్రసాద్, ఆర్అండ్​బీ ఈఈ బిమ్లా నాయక్, తహసీల్దార్స్ భద్రకాళి, భగవాన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed