- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యధేచ్చగా జీరో ఇసుక లారీలు..పట్టించుకోని అధికారులు
దిశ, ఏటూరునాగారం : ములుగు జిల్లాలో ఇసుక లారీల జీరో దందా మూడు పువ్వులు ఆరుకాయాలుగా కోనసాగుతుంది. క్వారీల వైపు మైనింగ్, టీఎస్ ఏండీసీ అధికారుల దృష్టి లేక ఇసుక కాంట్రాక్టార్లు ఆడింది అటాగా,పాడింది పాటాగా జీరో దందా..సాఫీగా కోనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. క్వారీలు నిర్వహిస్తున్న కాంట్రాక్టార్లకు సంబంధిత శాఖ అధికారుల అండదండలు దండిగా ఉండడంతో జీరో లారీలు సాఫీగా జిల్లా కేంద్రాన్ని దాటుతున్నాయి అనే మాటలు ఏజెన్సీలో గట్టిగానే వినబడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లాలోని పలు మండలాలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీల నుండి నిత్యం సరైన పత్రాలు లేకుండా ఇసుక లారీలు జీరో దందా రూపంలో జిల్లా కేంద్రాన్ని దాటుతున్నాయి. నిత్యం జీరో లారీలు వెళుతున్నా తనీఖీలు శూన్యంగా ఉండడంతో సంబంధిత శాఖ అధికారుల అండదండలు క్వారీలు నిర్వహకులకు గట్టిగానే ఉన్నాయన్నా మాటలు వినబడుతున్నాయి.
యధేచ్చగా జీరో లారీలు..
ఇసుక ర్యాంపుల నుండి నిత్యం సరైన (డీడీ)పత్రాలు లేకుండా రోజులో 7నుండి 10 జీరోలు వెతులున్నాట్టుగా దిశకు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలోనే ఏటూరునాగారం పరిసర ప్రాంతాల నుండి వెలుతున్న జీరో లారీనీ అటవీశాఖ వారు పట్టకున్నారు. కాగా పట్టుకున్న జీరో ఇసుక లారీ ఏ క్వారీ నుండి వస్తుంది అనేది అధికారులు వెల్లడించాల్సి ఉంది.
లోడ్ చేయాలంటే డబ్బు కట్టాలి..
దిశ కు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు..ఆన్‌లైన్లో ఇసుక కోసం బుక్ చేసుకున్న లారీలు క్వారీల వద్దకు ఇసుక కోసం సరైన పత్రాలతో వెళ్లిన కూడా లారీ లోడ్ చేయాలంటే క్వారీ నిర్వహకులు 3500 రూపాయాలు లారీ డ్రైవర్ల వద్ద నుండి వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై దిశ ఒక లారీ డ్రైవర్‌నీ అడగగా లారీ లోడ్ చేయాలంటే 3500 క్వారీ వాళ్లకు చెల్లించాల్సి వస్తుందని ఒక వేళ డబ్బులు కట్టకపోతే ఆ లారీనీ 3 నుండి 4 నాలుగు రోజులు సరైన కారణం లేకుండా క్వారీ వద్దనే నిరీక్షించేలా చేస్తున్నారని తన అవేదనను తెలిపాడు. ఒక వేళ లారీ డ్రైవర్లు ఏదురు తిరిగి ప్రశ్నిస్తే బల్క్ లోడ్స్ ఉన్నాయి అవి లోడ్ అయ్యేంత వరకు మీవీ లోడ్ చేయడం కుదరదు అనీ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు లారీ డ్రైవర్ తెలిపాడు.
జీరో లారీ తరలుతున్న విధానం..
ఇసుక ర్యాంపుల నుండి జీరో లారీలను దాటిస్తున్న అక్రమా ఇసుకాసురులు ఏవరైన పట్టకుంటే..పట్టుబడకుండా పకడ్బంది అలోచనలు అమలు చేస్తున్నారు. ఒక లారీ ఇసుక లోడ్ కు గతంలో డీడీ తీసి నిబంధనల ప్రకారం తరలించి మళ్లే అదే డీడీనీ చూపిస్తూ ఇసుక లారీలను దాటిస్తున్నారు. ఒక వేళ ఏవరైన అనుమానంతో పట్టుకుంటే వారిని సద్దుమనిగించడానికి ఈ దందా కోసం ఏర్పాటు చేసుకున్న ఒక వ్యక్తి రంగంలోకి దిగి వారికి కావాలసింది చేసి లారీనీ అక్కడి నుండి దాటవేస్తాడు. రాత్రి సమయంలో తనీఖీలు శూన్యంగా ఉండడంతో ఇసుకాసురులు అక్రమ ఇసుక రవాణా రాత్రి సపమయంలో కోనసాగిస్తున్నట్లు ఏజెన్సీలో గుసగుసలు వినబడుతున్నాయి.
పట్టిపట్టనట్లు టీఎస్ ఏండీసీ అధికారులు
యధేచ్చగా కొనసాగుతున్న జీరో దందా సంబంధిత శాఖల అధికారులకు తెలిసే వారి కనుసైగలలో కొనసాగుతున్నట్లు ఏజన్సీలో గుసగుసలు వినబడుతున్నాయి. జీరో లారీలను ఏవరైన గుర్తించి సంబంధిత శాఖల అధికారులకు ఫోన్ ద్వారా పలుమార్లు సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించిన సదరు శాఖ అధికారులు ఏంతకీ ఫోన్ ఎత్తకపోవడం గమనార్హం. ఒకవేళ ఫోన్‌లో ఆ అధికారులు అందుబాటులోకి వచ్చినా..అక్కడే మా సిబ్బంది ఉంది అలాంటిది ఏం జరగదు అని మాటా దాటివేయడం జరుగుతుందని స్థానికులు చేపుతున్నారు.
తనీఖీలు శూన్యం..
ఓవర్ బకెట్‌లతో, జీరో లారీలతో నిత్యం ఇసుక లారీలు వెలుతున్నా అధికారులు స్పందించడం లేదు. ఏక్కడ కూడా నామా మాత్రపు తనీఖీలు లేక పోవడం వల్ల ఇసుకాసురులు హాయిగా తమ వ్యాపారాన్ని ఏలాంటి అడ్డు లేకుండా కొనసాగిస్తున్నారు. గతంలో జిల్లా కలెక్టర్ అదేశాల మేరకు చిన్నబోయిన పల్లి వేబ్రీడ్జి వద్ద రెవిన్యూ శాఖ వారీ ఆధ్వర్యంలో ఇసుకా లారీల కోసం ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తనీఖీలు నిర్వహించే వారు. ఇప్పుడు అ తనీఖీ కేంద్రం కూడా కనిపించకపోవడం గమనార్హం. ఇప్పటికైన సంబంధిత శాఖల అధికారులు అక్రమ మార్గాన తరలుతున్న ఇసుక లారీల కోసం ప్రత్యేక తనీఖీలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.