ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి చేయని అభివృద్ధి చేశా : Errabelli Dayakar Rao

by Aamani |   ( Updated:2023-11-10 09:27:25.0  )
ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి చేయని అభివృద్ధి చేశా : Errabelli Dayakar Rao
X

దిశ, పెద్దవంగర : ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి చేయని అభివృద్ధి చేశానని పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కోరిపల్లి, వడ్డే కొత్తపల్లి, పోచారం, గంట్ల కుంట గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో ఆరోగ్య శ్రీ ట్రస్ట్ చైర్మన్ డా. నెమురుగొమ్ముల సుధాకర్ రావు, యర్రం రెడ్డి తిరుపతి రెడ్డిలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు వచ్చే ప్రతిపక్ష నాయకులను నమ్మకండి. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. సీఎం కేసీఆర్ హయాంలో బంగారు తెలంగాణ అవుతుంది. పాలకుర్తిని అభివృద్ధి చేసింది నేనే. పాలకుర్తిని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దాను.గత పాలకుల హయాంలో పాలకుర్తి అభివృద్ధి శూన్యం. కేసీఆర్ సహకారంతో పాలకుర్తిని అన్నింటిలో ముందు వరుసలో ఉంచాను.

పాలకుర్తిలో యాభై పడకల దవాఖాన మంజూరు చేయించిన, రాష్ట్రంలో అత్యధిక డబుల్ బెడ్ రూం ఇండ్లు పాలకుర్తి నియోజకవర్గంలో కట్టించాను. కొన్ని గ్రామాల్లో డబుల్ బెడ్ రూంలకు స్థలం లేకపోతే, నా సొంత ఖర్చులతో స్థలాన్ని కొని కట్టించాను. పెద్దవంగర మండలంలో అన్ని గ్రామాలకు రోడ్లను బాగు చేయించాను. గ్రామాలను కడిగిన ముత్యంలా చేశానని మరోసారి నన్ను ఆశీర్వదించండి అని కోరారు.కష్టకాలంలో మీ అందరికీ తోడున్నానని, మీకు వెన్నంటే ఉంటున్నానని ఎన్నికలప్పుడు వచ్చే ప్రతిపక్ష పార్టీలను నమ్మవద్దని కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు రామచంద్రయ్య శర్మ, ముత్తినేని శ్రీనివాస్, యాదగిరి రావు, ఈదురు ఐలయ్య, శ్రీరామ్ సంజయ్, సుధీర్ బాబు, జ్ఞానేశ్వర్ చారి, మల్లికార్జున చారి, సర్పంచ్, ఎంపీటీసీలు, యువకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story