- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవిశ్వాసం ప్రవేశపెట్టిన సొంత పార్టీ నేతలు..
దిశ, కొత్తగూడ : సొసైటీ చైర్మన్ పై సొంతపార్టీకి చెందిన డైరెక్టర్ లే అవిశ్వాస తీర్మానం పెట్టడం కలకలం రేపుతున్నది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పొగుళ్ళపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఏజెన్సీ రైతుల సౌకర్యార్థం పొగుళ్ళపల్లిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీ.ఏ.సీ.ఎస్) 13 మంది డైరెక్టర్ లతో ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో తెరాస 9 డైరెక్టర్ లను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ నాలుగు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెరాస నుండి ఎన్నికైన దేశిడి శ్రీనివాస్ రెడ్డి ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్, పొగుళ్లపల్లి పీఏసీఎస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఇదిలా ఉండగా గడచిన కొన్నినెలలుగా చైర్మన్, డైరెక్టర్ ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. డైరెక్టర్ లను కలుపుకుపోవడం లేదన్న విమర్శలు మొదలయ్యాయి. ఇటీవలి కాలంలో అవి మరింత పెరిగిపోయాయి. దీనికి తోడు చైర్మన్ ఒంటెద్దు పోకడలతో విసిగిపోయామని డైరెక్టర్ లు మూకుమ్మడిగా డీసీఓ కుర్షిత్ ని కలిశారు. వీరికి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన డైరెక్టర్ లు సైతం మద్దతు తెలిపారు. ఈ క్రమంలో అందరూ కలిసి చైర్మన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటిస్తున్నట్లు డీసీఓకి పత్రాన్ని అందజేశారు.