- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏనుమాముల మార్కెట్ లో కొత్త నిబంధనలు: ఎక్కువ తొక్కద్దు.. తక్కువ తేవద్దు
దిశ, వరంగల్ టౌన్: దేశంలో రెండో అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో కొత్త నిబంధనలు రాబోతున్నాయి. రైతులు తెచ్చే సరుకులపై ఆంక్షలు అమలు కాబోతున్నాయి. ఇప్పటి వరకు రైతులు తమ అనుకూలత, సౌలభ్యతను బట్టి పంట ఉత్పత్తులను బస్తాల్లో సరుకులు నింపి తెచ్చేవారు. ఒక్కో బస్తాలో 50, 60కిలోలకు మించి కూడా సరుకు నింపేవారు. అయితే ఇక నుంచి అలా తీసుకురావడానికి వీలు లేకుండా వ్యాపారుల ప్రోద్భలంతో పాలకవర్గం, అధికారులు కొత్త నిబంధనల అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ఒక బస్తాలో 25 కిలోలకు తగ్గకుండా, 49కిలోలకు మించకుండా సరుకు తీసుకురావాలనే ఆంక్షలు అమలు చేస్తున్నారు.
ఏప్రిల్ నెల నుంచి ఈ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు దిడ్డి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో అధికారులు, పాలకవర్గ సభ్యులు ప్రచారం నిర్వహించారు. పలు యార్డుల్లో రైతులకు కరపత్రాలు పంచారు. గ్రామాల్లో సైతం ఏఈవోల ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు భాగ్యలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పివి రాహుల్, గ్రేడ్ 2 కార్యదర్శులు పి.చందర్ రావు, ఎండి బియబాని తదితరులు పాల్గొన్నారు.