- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MP Konda Visveshwar Reddy : ‘హామీలను నెరవేర్చక చతికిలపడ్డ రాష్ట్ర ప్రభుత్వం’
దిశ, వరంగల్ : తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని, పార్టీ గెలుపుకోసం శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ ధర్మారంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా కార్యవర్గ సమావేశం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి ముందుగా గంట రవికుమార్ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడో సారి ఎన్నికైన సందర్భంగా అభినందన తీర్మానాన్ని, జిల్లా సమస్యలపై రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వీటికి కార్యవర్గ ఆమోదం తెలిపింది.
ముఖ్యంగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు అందించిన వరంగల్ జిల్లా ప్రజలకు, కార్యవర్గం సెల్యూట్ చేసింది. అనంతరం కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిందని ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లాలో శాంతి భద్రతలు, వైద్య ఆరోగ్య సేవలు పూర్తిగా క్షీణించాయన్నారు. పోలీసు వ్యవస్థ, వైద్య శాఖ ఇందులో పూర్తిగా విఫలం చెందాయి అన్నారు. అధికారులు పాలకులకు విధేయులుగా ఉంటున్నారు తప్ప , వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం లేదని మండిపడ్డారు. ఆంక్షలులేని రుణా చేయాలి, రైతులకు ఎలాంటి ఆంశలు పెట్టకుండా ప్రభుత్వం రెండులక్షల రైతు రుణ మాఫీ చేయాలని విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ధరణి ప్రక్షాళన వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. గొర్రెల పంపిణీలో, చేప పిల్లల పంపిణీలో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని, జిల్లా లోని అర్హులైన అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలన్నారు. గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని టెక్స్ టైల్ పార్క్ లో భూమిని కోల్పోయిన రైతులకు ఇప్పటి వరకు నష్టపరిహారం అందించలేదని తక్షణమే వారికి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలో 3 సంవత్సరాల క్రితం నేషనల్ హెల్త్ స్కీం క్రింద 67 కోట్ల తో గత ప్రభుత్వం 250 పడకల ఆసుపత్రిని నిర్మిస్తే అవి లోపభూయిష్టంగా ఉండి, అప్పుడే పెచ్చులూడిపోతున్నాయని, ఇది గత ప్రభుత్వ అవినీతికి నిదర్శనమని ఆరోపించారు. ప్రతీ కార్యకర్త సైనిక శక్తిలా పనిచేయాలని, ప్రతీ కార్యకర్త సైనిక శక్తిలా గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలతో ఉంటూ వారికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు వివరించాలని విశ్వేశ్వర్ రెడ్డి సూచించారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. అధికారులపై పాలకులకు పూర్తిగా పట్టు కోల్పోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, కంభంపాటి పుల్లారావు, జిల్లా పదాధికారులు, కార్పొరేటర్లు జలగం అనిత, గందే కల్పన, కౌన్సిలర్లు శీలం రాంబాబు, జురుయా రాజు యాదవ్, గొరియా నాయక్ , జిల్లా పదాధికారులు, వివిధ మోర్చా అధ్యక్షుడు, మండల, డివిజన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిలు, మండల, డివిజన్ మాజీ అధ్యక్షులు పాల్గొన్నారు.