- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనగామ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. హాజరైన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
దిశ, జనగామ: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం జనగామకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం 504 రైల్వే స్టేషనులను ఆధునికరిస్తూ నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జనగామ రైల్వే స్టేషన్ కు రూ.24.20 కోట్లు కేంద్రం కేటాయించింది. కాగా ప్రధాని నరేంద్ర ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో వర్చువల్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జనగామకు చేరుకున్నారు.
జనగామకు వచ్చిన కోమటిరెడ్డికి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరు ప్రతాపరెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళ కౌన్సిలర్లు ఘన స్వాగతం పలికారు. తొలుత పట్టణంలోని చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం నేరుగా రైల్వే స్టేషన్ కు చేరుకుని ప్రారంభించే అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.