కంకర పరిచారు .. రోలింగ్ మరిచారు...ఆ రోడ్డుపై వెళ్లాలంటే సర్కస్ ఫీట్లే..

by Disha Web Desk 23 |
కంకర పరిచారు .. రోలింగ్ మరిచారు...ఆ రోడ్డుపై వెళ్లాలంటే సర్కస్ ఫీట్లే..
X

దిశ, బయ్యారం : మండలంలో గత బీఆర్ఎస్ పరిపాలనలో ఎస్టీ ఎస్డీఎఫ్ నిధుల కింద గ్రామాలను లింక్ చేసే లింక్ రోడ్లను విస్తరణ చేసేందుకు ప్రభుత్వం సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలను వెచ్చించింది. ఈ పనులను దక్కించుకున్న గుత్తేదారుడు ఆ పనులను గత అక్టోబర్ నెలలో ప్రారంభించి పనులు మొదలు గావించారు. పనులలో భాగంగా మహాదేవుని గుడి నుండి పెద్దల గడ్డ బోయ రోడ్డు సుమారుగా రెండు కిలోమీటర్ల రోడ్డుకి రెండు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు సమాచారం. కంకర పోసి దానిని రోలింగ్ చేయకుండానే వదిలివేయడంతో అటువైపు వెళ్ళే వాహనదారులు. రైతులు. కూలీలు. పశువులు. అనేక ఇబ్బందుల పడుతున్నారు. కంకర పోసి రోలింగ్ చేయాల్సిన సదరు కాంట్రాక్టర్ రోలింగ్ చేయకుండా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల స్థానికులు సంబంధిత పర్యవేక్షణ అధికారులపై మండి పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోసిన కంకర ను క్యూరింగ్ చేసి రోలింగ్ తో చదును చేయాలని వేడుకుంటున్నారు.

స్థానికుడు యాస రామారావు( వెంకట్రాం పురం)..

వెంకట్రాంపురం నుండి తమ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణలో సదర్ కాంట్రాక్టర్ కంకర పోసి సుమారు ఆరు నెలలైనా రోడ్డు పోసిన కాంట్రాక్టర్ రోలింగ్ చేయకుండా ఉండడం వల్ల ఈ దారిపై నిత్యం వెళ్లాలంటే వాహనదారులు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుందని అన్నారు కొంతమంది వాహనదారులు కంకర స్లిప్పయి ప్రమాదాలకు గురి అవుతున్నారని అన్నారు. వెంటనే పనులు చేయాలని వేడుకున్నారు.



Next Story

Most Viewed