కంటి అద్దాలను ధ్వంసం చేసిన కోతులు..

by Kalyani |
కంటి అద్దాలను ధ్వంసం చేసిన కోతులు..
X

దిశ, నర్సింహులపేట: నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. సోమవారం కంటి వెలుగు శిబిరంలోకి కోతులు చొరబడి కంటి అద్దాలను ధ్వంసం చేశాయి. కంటి పరీక్షలకు ఉపయోగించే పరికరాలను, వస్తువులను చిందరవందరగా పడేశాయి. కనీసం కిటికీలు సరిగా లేని గదుల్లో కంటి వెలుగు శిబిరాన్ని ఏర్పాటు చేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మెడికల్ సిబ్బంది, ఉన్నతాధికారులు, గ్రామ సర్పంచ్ స్పందించి కంటి వెలుగు శిబిరాన్ని మార్చాల్సిందిగా పడమటి గూడెం గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story