కిషన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు : కడియం శ్రీహరి

by Disha News Web Desk |
కిషన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారు : కడియం శ్రీహరి
X

దిశ, హన్మకొండ టౌన్: దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ ఓడిపోతుందని, దళిత, గిరిజనులే ఓడిస్తారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని హరిత హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ దయాకర్, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌తో కలసి మాట్లాడారు. విభజన చట్టంలో పొందుపరిచిన విధులు నియమాకాలపై రాష్ట్ర బీజేపీ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించడంలో కిషన్ రెడ్డి గోరంగా విఫలం అయ్యారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయకపోగా, ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను బడా వ్యాపారస్తులకు అప్పనంగా అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కి కొంగ జపం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ, బీజేపీ నాయకులు తమ పబ్బం గడుపుకుంటున్నారని, వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

Advertisement

Next Story