ధైర్యం కోల్పోవొద్దు.. పరిహారం ఇప్పిస్తా: ఎమ్మెల్యే గండ్ర

by Disha daily Web Desk |
test text
X

టెస్ట్ image

దిశ, రేగొండ: రేగొండ మండలంలోని చెన్నాపూర్ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న మిర్చి తోటలను సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ వర్షాలకు మిర్చిపంటలు దెబ్బతిన్న రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని, కృంగిపోవద్దని, ధైర్యంగా ఉండాలన్నారు. నష్టపోయిన రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి నష్టపరిహారం ఇప్పిస్తానని తెలిపారు. ప్రభుత్వం రైతులందరికీ అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు అంకం రాజేందర్, ఎంపీటీసీ శ్రీధర్, రూపిరెడ్డి చంద్రారెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు రవీందర్ రావు, కొడవంచ ఆలయ చైర్మన్ హింగే మహేందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్, రేగొండ టౌన్ అధ్యక్షుడు కోలేపక భిక్షపతి, మాజీ సర్పంచ్ రమేష్, మండల ఉపాధ్యక్షుడు గంపల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed