- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నష్టపోయిన రైతులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చల్లా
దిశ, సంగెం: సంగెం మండలంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన పల్లార్ గూడ, వీఆర్ఎన్ తండా, వంజరపల్లి, పోచమ్మ తండా, గ్రామంలో 1264 మంది రైతులకు కోటి 7లక్షలు మొండ్రాయి, ముమ్మిడివరం, గొల్లపల్లిలో 1099 మంది రైతులకు 99 లక్షలు, నార్లవాయి, నల్లబెల్లి గ్రామంలో 223 మంది రైతులకు 24 లక్షల 84 వేల పంట నష్టపరిహారం చెక్కులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందజేశారు. అదేవిధంగా పల్లార్ గూడ గ్రామంలో 85 లక్షలతో సీసీ రోడ్ల ప్రారంభం, గొల్లపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీకి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని, రైతులకు రైతు బంధు, రైతు బీమా, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ చేసి సమైక్య రాష్ట్రంలో దండగన్న వ్యవసాయాన్ని తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక వ్యవసాయాన్ని పండుగల చేసి చూపిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, ఎంపీపీ కందగట్ల కళావతి నరహరి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.