ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

by Disha News Web Desk |
ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా.. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
X

దిశ , ఆత్మకూర్: గ్రామ ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధిలో పోటీపడి పనిచేయాలని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం హౌస్ బుజుర్గ్ గ్రామంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో అభివృద్ధి పనుల దృష్ట్యా రూ.1కోటి 30లక్షలు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధులు నేషన్ హైవే జంక్షన్ నుండి గ్రామ చివరి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. మిగతా నిధులు గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. త్వరలోనే గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ప్రజలంతా గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. అందరూ సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్ని నిధులైన కేటాయించడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు.


Advertisement

Next Story