- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మీకు సిగ్గు, శరం ఉంటే అతనికి ఓట్లు ఎట్లా వేస్తారు.. నేను లోకల్ నాకే ఓటెయ్యాలి..!'
దిశ, మరిపెడ : శాసనసభ ఎన్నికలకు కేవలం 20 రోజులు సమయం ఉంది. ప్రచారంలో పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. చేసిన పనిని చూపిస్తూ అభివృద్ధి అంటే ఇలా ఉంటుందంటూ మరొకసారి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంటే అభివృద్ధి ఎక్కడ జరగలేదు అసలు అభివృద్ధి అంటే ఏంటో మేము చేసి చూపిస్తాం అంటు ఈ సారి మాకే అవకాశం ఇవ్వాలి అని ప్రతిపక్ష పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి. ఓటర్లని తమ వైపు తిప్పుకునేందుకు లీడర్లు, నాయకులు సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైన వాగ్దానాలు హామీలు సైతం ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఓటర్లను దేవుళ్ళుగా కొలుస్తున్నారు. కానీ డోర్నకల్ సీనియర్ శాసనసభ్యులు డీఎస్ రెడ్యానాయక్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపట్ల సొంత క్యాడర్ సైతం అయోమయానికి గురవుతున్నారు.
వారు గత రెండు రోజుల క్రితం దంతాలపల్లి మండలం వేములపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ఓటర్లను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మీకు సిగ్గు, శరం వుంటే సూర్యాపేటోనికి ఎట్లా ఓటు వేస్తారు.. నేను లోకల్ నాకే ఓటెయ్యాలి అంటూ రెండు, మూడు సార్లు అనడంతో అక్కడున్న ఓటర్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఓట్లు అడగడానికి వచ్చిన సీనియర్ ఎమ్మెల్యే ఇలా బాధ్యత మర్చి ప్రవర్తించడం పట్ల గ్రామస్తులు గుస్సా అయ్యారు. మేము ఎటు ఓటు వేయాలో చెప్పడానికి నువ్వు ఎవరు మా ఊర్లో బాగా అభివృద్ధి చేసినావు గాని మల్లొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావా అంటూ గ్రామస్తులు ఫైర్ అయ్యారు. వేరే వాళ్లకి ఇక్కడ ఓటు అడిగే హక్కులేదు సరే మరి నీ బిడ్డ ఇల్లందు నియోజకవర్గమైతే మానుకోటలో ఎందుకు నిలబడుతుందో సమాధానం చెప్పు అంటూ ప్రశ్నించారు. అలాగే రామచంద్రు నాయక్ టికెట్ రాగానే రెడ్యాకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదని కాంగ్రెస్ నాయకులు ఎద్దేవా చేస్తున్నారు.