గిరిజన గురుకులంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ..

by Kalyani |
గిరిజన గురుకులంలో మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ..
X

దిశ, మహబూబాబాద్ టౌన్: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆకస్మిక తనిఖీ చేశారు. మొదట పాఠశాలలో తరగతి గదులకు నేరుగా వెళ్లి విద్యార్థులతో మమేకమై ఉపాధ్యాయులు బోధిస్తున్న తీరును పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల్లో ఆత్మస్థైరం పెంపొందించే విధంగా పాఠాంశాలు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచితంగా భోజన వసతితోపాటు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా గురుకులాలు ఏర్పాటు చేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్‌ స్థాయి విద్య అందించడం జరుగుతుంన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుమారి అంగోత్ బిందు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed