- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపడమే కేసీఆర్ లక్ష్యం.. మంత్రి సత్యవతి రాథోడ్
దిశ, మహబూబాబాద్ టౌన్: దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు, సమాజంలో అందరితో సమానంగా వారు వృద్ధిలోకి రావాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సన్నాహాక సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. హుజురాబాద్ అనంతరం ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో 100 మందికి లబ్ది చేకూర్చాలని.. మార్చి 5వ తేదీలోపు అర్హులనూ గుర్తించాలని కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. రానున్న ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో 2000 మంది చొప్పున ప్రతి నియోజక వర్గంలో ఎంపిక చేయనున్నామని వెల్లడించారు. దళిత బంధు పథకం కింద లబ్ధి దారులకు 10 లక్షల రూపాయలతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నామని చెప్పారు. ఈ సమావేశానికి జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్సీ తక్కెలపళ్లి రవీందర్ రావు, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, కలెక్టర్ శశాంక, దళిత బంధు స్పెషల్ ఆఫీసర్ సన్యాసయ్య, జిల్లా ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.