ఆరూరికి అండగా ఉండండి.. నేనున్నా : Minister Errabelli Dayakar Rao

by Sumithra |   ( Updated:2023-07-19 09:16:25.0  )
ఆరూరికి అండగా ఉండండి.. నేనున్నా : Minister Errabelli Dayakar Rao
X

దిశ, పర్వతగిరి : ఆరూరికి అండగా ఉండండి, మీకు ఏ సమస్య ఉన్న నేను పరిష్కరిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. మంగళవారం అసమ్మతి నేతలతో పర్వతగిరి వద్ద తన నివాసంలో భేటీ అయ్యారు. వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అరూరికి టికెట్ ఇవ్వొద్దని, ఎవరికి ఇచ్చిన మేము గెలిపించుకుంటామని చెప్పిన నియోజకవర్గ అసంతృప్తి బీఆర్ఎస్ నేతలకు మంత్రి ఎర్రబెల్లి సర్దిచెప్పారు. వేరేవారికి టికెట్ ఇస్తే పార్టీకి నష్టం కలుగుతోందని మంత్రి ఎర్రబెల్లి చెప్పుకుంటూ వచ్చారు.

ఈ సందర్భంగా వర్ధన్నపేట శాసనసభ్యుడు అరూరి రమేశ్ కు అందరూ సహకరించాలని డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, రైతు బందు అధ్యక్షురాలు ఎల్లవుల లలిత యాదవ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావుతో అసమ్మతి నేతలకు సర్ది చెప్పాడు. అదేవిధంగా అసమ్మతితో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే అరూరి రమేష్ వ్యవహార తీరును మంత్రి ఎర్రబెల్లికి వివరించారు. త్వరలోనే ఎమ్మెల్యే అరూరి రమేష్ తో భేటి అయి సమస్యలను పరిష్కరిస్తానని నచ్చజెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబి ఛైర్మెన్ మర్నేని రవీందర్ రావు, రైతుబంధు అధ్యక్షురాలు ఎల్లవుల లలిత యాదవ్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, ఇంకా అసమ్మతి బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

Read more : చంద్రబాబు నాయుడి వారసుడే రేవంత్ రెడ్డి : Minister Thanneeru. Harish Rao

Advertisement

Next Story