- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిత్యజీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గించండి : మంత్రి సురేఖ
దిశ,వరంగల్ కలెక్టరేట్ : అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యావరణాన్ని కాపాడాలని వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందేశంలో మంత్రి మాట్లాడుతూ మనం పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో, అంతే కూడా నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన ఆరోగ్యకరమైన పరిసరాలను అందించడం కూడా మన అందరి బాధ్యత అన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు, గాలి, నీరు కలుషితం అవుతున్నాయన్నారు. ప్రభుత్వ ప్రయత్నాలకు తోడు, ప్రజలు కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా వదిలెయ్యాలని పిలుపు నిచ్చారు. ప్లాస్టిక్ బాటిల్స్ బదులుగా గ్లాస్ బాటిల్స్ లేదంటే స్టీల్ వస్తువుల వాడకాన్ని పెంచాలని సూచించారు.