- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మేడం రాలేదని అధికారుల డుమ్మా..!
దిశ, వరంగల్ టౌన్: వరంగల్ మహానగర పాలక సంస్థ పాలన వ్యవహారాలు విస్తుగొల్పుతున్నాయి. ఇప్పటికీ ప్రతీ పనికి లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బల్దియా అధికారులు, ఇప్పుడు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు చవిచూడాల్సిన దుస్థితి దాపురించింది. వారానికి ఒక్క రోజైనా ప్రజలకు అందుబాటులో ఉండడానికి కూడా అధికారులకు తీరిక దొరకడం లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బల్దియాలో ప్రతీ సోమవారం ప్రజా సమస్యలు పరిశీలనకు గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తుంటారు. ఇందులో అన్ని విభాగాల అధికారులు తప్పక హాజరు కావాలి.
అయితే, రెండు వారాలుగా పలువురు అధికారులు ఈ కార్యక్రమానికి డుమ్మా కొడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం కూడా పలు విభాగాల అధికారులు గైర్హాజరు కావడంతో ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు బల్దియా పరిధిలో 10 కిలోమీటర్ల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తుంటారు. తీరా తమ సమస్యపై సమాధానం ఇచ్చే వారు గ్రీవెన్స్‌సెల్‌లో అధికారులు అందుబాటులో లేకపోవడం బాధితులు నిరాశ చెందాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.
కమిషనర్ లేకపోతే అంతే..
గ్రీవెన్స్ సెల్ కమిషనర్ ఆధ్వర్యంలో జరుగుతుంది.రెండు వారాలుగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ఇతర పనుల కారణంగా హాజరు కాలేకపోతున్నట్లు సమాచారం. ఇదే అదనుగా పలువురు అధికారులు కూడా రెండు వారాలుగా డుమ్మా కొడుతున్నట్లు బల్దియాలో చర్చ జరుగుతోంది. గ్రీవెన్స్‌కు వచ్చిన అధికారులు కూడా మధ్యలో వెళ్లి తమ విభాగాలకు వెళ్లి బాతాఖాని పెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
టౌన్ ప్లానింగ్‌కే ఎక్కువ..
ఇక గ్రీవెన్స్‌సెల్‌కు వచ్చే వినతుల్లో టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన వినతులే ఎక్కువగా వస్తున్నాయి. ఈ వారం మొత్తం 83 మంది విజ్ఞాపనలు అందజేయగా అందులో టౌన్ ప్లానింగ్‌పై 40 ఫిర్యాదులు రావడం గమనార్హం. ఇంటి నంబర్ల కేటాయింపు, భూ ఆక్రమణలు, ఆక్రమిత భూముల్లో ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వడం పైనే ప్రజల నుంచి ఎక్కువగా వినతులు వస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో అధికారుల విధి నిర్వహణపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
లంచాలకు అలవాటు పడిన అధికారులు కొందరు అక్రమార్కులకకు అండగా నిలవడంతో ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీరా తమ గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చినా వినేందుకు అధికారులు అందుబాటులో లేకపోవడం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుతో బల్దియా ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తోందని బాధితులు ధ్వజమెత్తుతున్నారు.