- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఓర్వలేక దాడులు చేస్తున్న బీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పండి: మాణిక్ రావు థాక్రే
దిశ, వరంగల్ కలెక్టరేట్: జిల్లాలోని పశ్చిమ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన పశ్చిమ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోట పవన్ ను పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చామని... ప్రజా వ్యతిరేకతను అణగదొక్కి ఎక్కువ రోజులు పాలన సాగించలేరని.. టీపీసీసీ ఇంచార్జి మాణిక్ రావు థాక్రే అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతిపక్ష పార్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దాడులకు భయపడేది లేదన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ లోని ప్రతీ ఒక్క కార్యకర్తకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల దాడులు మరీ మితిమీరుతున్నాయన్నారు. ముఖ్యంగా ఇటీవల కోదాడలో వాల్యా నాయక్ అనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తను ఛాతిలో కాలుతో తొక్కి చంపే ప్రయత్నం చేసారని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు తమ అధికారాన్ని కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో అన్ని ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై, నాయకులపై భౌతిక దాడులు రోజురోజుకూ ఎక్కువ చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి జనసభ మీటింగ్ ప్రజాదరణ చూసి.. ఏదో ఒక గలాటా చేసి ప్రజల దృష్టిని మరల్చడానికి చేసిన ప్రయత్నమే పవన్ పైన దాడి అన్నారు. ఈ యాత్రలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై అతి దారుణంగా దాడి చేశారు.. ఇనుప రాడ్లతో తల మీద కొట్టిచనిపోయాడని వదిలిపెట్టి పోయారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికార నాయకులకు కూడా తెలుసు ఆ దాడి వెనుక స్థానిక ఎమ్మెల్యే హస్తముందని అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచిది కాదన్నారు.
ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఎవరిదంటే కేవలం కల్వకుంట్ల కుటంబానిది మాత్రమే అభివృద్ధన్నారు. ఈరోజు దేశంలో కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలను ఏకం చేసే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉందని.. కేసీఆర్, నరేంద్ర మోడీతో ఢిల్లీలో దోస్తీ గల్లిలో కుస్తీ పడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మార్చుకుని ప్రజలను మభ్యపెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి వర్యులు సంభాని చంద్ర శేఖర్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.