- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
MLA GANDRA : తేమ పేరుతో దోచుకుంటే ఉపేక్షించేది లేదు
దిశ, చిట్యాల: తేమ పేరుతో దోచుకుంటే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. సోమవారం మండలంలోని శాంతినగర్ లో ఆంజనేయ ఆగ్రో ఇండస్ట్రీస్, కైలాపూర్ లో శ్రీ బాలమురుగన్ కాటన్ ఇండస్ట్రీలను వేద పండితుల మంత్రోత్సాహరణతో,స్వాగతం పలుకుతూ ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఈ ప్రాంత రైతులు, పత్తిని అధిక దిగుబడితో సాగు చేస్తారని, పత్తి తీసుకువచ్చిన ప్రతి రైతుకు, ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరను ఎలాంటి ఆంక్షలు లేకుండా, తేమ పేరుతో దోచుకోకుండా చూడాలని, ఒకవేళ అలాంటి చర్యలు నా దృష్టికి వస్తే ఉపేక్షించేది లేదని తెలిపాడు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి మధ్యవర్తి లేకుండా, ఎనిమిది శాతం కంటే తక్కువ తేమ కలిగి ఉన్న పత్తిని, సిసిఐ ద్వారా కొనుగోలు చేస్తుందని, ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా, సీసీఐ ద్వారా మొత్తం 352 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
రైతులు తొందరపడి తక్కువ ధరకు పత్తి అమ్ముకోవద్దని సూచించారు. ఊళ్ళల్లో ఉండే దళారులకు పత్తి అమ్మ వద్దని తెలిపాడు. ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతును కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని తెలిపాడు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు గుట్ల తిరుపతి గడ్డం కొమురయ్య, వ్యవసాయ కమిటీ చైర్ పర్సన్ గుమ్మడి శ్రీదేవి సత్యనారాయణ, వ్యవసాయ కమిటీ సెక్రెటరీ శేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ,జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి జిల్లా నాయకులు ఓరంసమ్మన్న, టౌన్ అధ్యక్షులు లక్ష్మణ గౌడ్, యూత్ అధ్యక్షులు కుమార్, బీసీ సెల్ అధ్యక్షులు శ్రీనివాస్, రవి, నరసింహ రాములు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.