- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రజా సంక్షేమాభివృద్ధిలో భాగస్వాములవుదాం
దిశ, వరంగల్ బ్యూరో : ప్రజా సంక్షేమ అభివృద్ధిలో టీఎన్‌జీవోస్ భాగస్వాములవుతారని రాష్ట్ర గెజిటెడ్ సంఘం అధ్యక్షుడు, జేఏసీ కన్వీనర్ ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజా పరిపాలనలో ప్రభుత్వానికి సహకరిస్తూనే ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం భూపాలపల్లి టీజీవో కార్యాలయంలో నిర్వహించిన గెజిటెడ్ అధికారుల సంఘం ఎన్నికల ప్రక్రియకు ఏలూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్నికల అధికారిగా పెద్ది ఆంజనేయులు వ్యవహరించారు. ఈ సందర్భంగా శైలజ అధ్యక్షురాలిగా, కార్యదర్శిగా అవినాష్, అసోసియేట్ అధ్యక్షులుగా సంజీవ రావు ఉపాధ్యక్షులుగా నారాయణ రావులతో కలిపి భూపాలపల్లి జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ… ఉద్యోగుల హక్కులు, సమస్యలు సాధనలో రాజీ పడబోమని స్పష్టం చేశారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని తెలిపారు. పెండింగ్ బిల్లులు మొత్తం ఏప్రిల్ నాటికి చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి వివిధ కేటగిరీల ఉద్యోగులందరినీ కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి బాధ్యత వహిస్తున్నామని ఆయన తెలిపారు. 206 సంఘాలతో ఉద్యమాన్ని నడిపించడంలో ప్రతి ఒక్కరు సహకారమందించాలని కోరారు. ఏప్రిల్ నుంచి పిఆర్సి, హెల్త్ కార్డ్స్ పెండింగ్ డీఏలు, సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు ఇలా మొత్తం 317 డిమాండ్లతో పాటు అన్ని సమస్యలు పరిష్కారానికి హామీ ఇచ్చారన్నారు.
ఉద్యోగుల సమస్య లు పరిష్కారానికి ప్రకటించిన కార్యాచరణ ప్రభుత్వ హామీలతో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఉద్యోగుల హక్కులు బాధ్యతలు నిర్మాణంలో ఎక్కడ రాజీ పడమని, హక్కులు, సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు మంజూరుకు సొసైటీ లు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, కోశాధికారి ఉపేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జగన్మోహన్, జాయింట్ సెక్రటరీ పరమేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామారావు, వరంగల్ టీజీఓస్ అధ్యక్షుడు శ్రీ మురళీధర్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు బూర్గు రవి, జయశంకర్ తదితరులు పాల్గొన్నారు.