నేడు కేయూ బంద్‌.. అరెస్టుల‌కు నిర‌స‌న‌గా జాక్ నేత‌ల పిలుపు

by Mahesh |
నేడు కేయూ బంద్‌.. అరెస్టుల‌కు నిర‌స‌న‌గా జాక్ నేత‌ల పిలుపు
X

దిశ‌, కేయూ క్యాంప‌స్: అక్రమ అరెస్టులను నిరసిస్తూ శనివారం కాకతీయ విశ్వవిద్యాలయం బంద్‌ను విజయవంతం చేయాలని జాక్ నేత‌ల పిలుపు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ విలేఖరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ -1 పేపర్ లీకేజ్ చేసి నిరుద్యోగులకు అన్యాయం చేయడాన్ని నిరసిస్తున్నామన్నారు. యూనివర్సిటీ అధికారులు ప్రభుత్వంతో కుమ్మకై కుట్రపూరితంగా విద్యార్థి సంఘాల నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడాన్ని ఖండించారు. వీసీ కార్యాలయాన్ని దిగ్బందించి విద్యార్థుల ఉద్యమ ఉదృతిని చూపించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed