ఈటల రాజేందర్ ది కాంగ్రెస్ పై బురదల్లే ప్రయత్నం: ఎమ్మెల్యే సీతక్క

by Kalyani |
ఈటల రాజేందర్ ది కాంగ్రెస్ పై బురదల్లే ప్రయత్నం: ఎమ్మెల్యే సీతక్క
X

దిశ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా ములుగు మండలంలోని కాసిందేవిపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, ఈటల రాజేందర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సమావేశంలో సీతక్క మాట్లాడుతూ రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ పై విసిరిన సవాలును స్వీకరించకుండా భాగ్యలక్ష్మి దేవాలయానికి రాకుండా అడ్డగోలుగా కాంగ్రెస్ పై బురదజల్లుతున్నారని, మునుగోడు ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి రూ. 25 కోట్లు తీసుకున్నట్లు ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు అవాస్తవమని అన్నారు. తెలంగాణ సమాజం కోసం కొట్లాడే రేవంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు.

ఈటల రాజేందర్ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, నియోజక వర్గ కో ఆర్డినేటర్ గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బానోత్ రవి చందర్, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నల్లెల భరత్ కుమార్, సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు, ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడి శెట్టి కోటి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్, జిల్లా నాయకులు చింత నిప్పుల భిక్షపతి, గందే శ్రీను, మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు చంద్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed