- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చిత్తశుద్ధితో పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీయే: బల్మూరి వెంకట్
దిశ, కమలాపూర్: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కేవలం వ్యక్తిగత లాభాల కోసమే రాజకీయాలు చేస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తుందని కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి బల్మూరి వెంకట్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బల్మూరివెంకట్ మాట్లాడారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఇద్దరు వ్యక్తిగత లాభాల కోసం ఒకరిపై ఒకరు పోటాపోటీగా ఆరోపణలు చేసుకుంటున్నారే తప్ప నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని వారి ఇరువురి తీరుపై మండిపడ్డారు.
పదవ తరగతి పరీక్ష పత్రం లీకేజ్ ఘటనలో ఎవరో చేసిన తప్పిదానికి అధికారులు టెన్త్ విద్యార్థిని ఐదు సంవత్సరాలు డిబార్ చేస్తే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఆ కుటుంబానికి కలిసి ధైర్యం చెప్పి, అండగా నిలబడలేదని ఆరోపించారు. పాడి కౌశిక్ రెడ్డి చెక్కులు ఇచ్చి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదని, ఆపదలో ఉన్న కుటుంబాలను పరామర్శించి అండగా నిలబడే ప్రయత్నం చేయాలని సూచించారు. అదే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భవిష్యత్ ఆలోచించి విద్యార్థి తరపున పోరాడి పరీక్ష రాసేలా ప్రయత్నం చేసిందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో విఫలమైందన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర శుక్రవారం కమలాపూర్ మండలంలో జరగనుందని ఈ పాదయాత్ర విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుండపు చరణ్ పటేల్, రాష్ట్ర నాయకులు తౌటం రవీందర్, నాయకులు కంభంపాటి ప్రసాద్, సముద్రాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.