కాంగ్రెస్‌తోనే ముస్లింల అభివృద్ధి : ములుగు ఏమ్మెల్యే సీతక్క..

by Sumithra |
కాంగ్రెస్‌తోనే ముస్లింల అభివృద్ధి : ములుగు ఏమ్మెల్యే సీతక్క..
X

దిశ, కొత్తగూడ : కాంగ్రెస్‌తోనే ముస్లింల అభివృద్ధి అని ములుగు ఏమ్మెల్యే డాక్టర్ సీతక్క అన్నారు. బుధువారం కొత్తగూడ, గంగారం మండలాలలో తహశీల్దార్ చందా నరేష్, పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈద్ ముబారక్ గిఫ్ట్ ప్యాక్ ల పంపిణి కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ అని ముందుగా ముస్లీంలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి గిఫ్ట్ ప్యాక్ లను పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింలకు 12శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ఎన్నికల్లో ప్రకటించి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌.. తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఎందుకు ఆ హామీని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో, రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పాటుపడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయేనన్నారు.

వారి సంక్షేమం కోసం అనేక పథకాలు, ఫలాలు కాంగ్రెస్ అందించిందన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించామని షాదిఖానాలు, మసీదుల అభివృద్ధి, ఈద్గా నిర్మాణం, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముస్లిం మైనార్టీలకు సరైన ప్రాధాన్యత అందించిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భారతి, జడ్పీటీసీలు పుల్సాం పుష్పలత, ఈసం రామ, ఎంపీపీలు బానోత్ విజయ రూప్ సింగ్, సరోజన జగ్గారావు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్, ముస్లిం కమిటీ మండల అధ్యక్షులు అజ్మీర్, వైస్ఎంపీపీ జంపయ్య, ఇమ్రాన్, ఖాజా, పాషా, అజ్మాత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed