36.2 అడుగుల బతుకమ్మ తయారీకి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్

by Kavitha |
36.2 అడుగుల బతుకమ్మ తయారీకి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్  రికార్డ్
X

దిశ, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ పార్క్ సెయింట్ మేరీస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ప్రపంచంలోకెల్లా అతి పెద్ద బతుకమ్మ ను తయారు చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. 36.2 అడుగుల బతుకమ్మ తయారు చేసే క్రమంలో భాగంగా పాఠశాల యాజమాన్యం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, 30 మంది ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, 700 మంది విద్యార్థులు పాల్గొని 24 గంటల లోపు తయారు చేశారు. దీనికి గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు వారి తరుపున నరేందర్ గౌడ్ సుభాషిని వ్యక్తులు విచ్చేసి ఇంతకు ముందు ఉన్నటువంటి 31 అడుగులు బతుకమ్మ రికార్డ్ ను బ్రేక్ చేసి అంతకన్నా పెద్ద ఎత్తు బతుకమ్మను తయారు చేసినందుకు గాను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ ఇచ్చి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసాని శ్రీధర్ ని సన్మానించారు.

ఘనంగా బతుకమ్మ వేడుకలు..

జనగామ జిల్లా కేంద్రంలోని నారాయణ స్కూల్​లో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వేడుకలకు వరంగల్​ జోన్​ డీజీఎం రిజ్వానా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్​ పర్హానా మాట్లాడుతూ… బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, పూలు కొలుస్తూ మహిళలు జరుపుకునే పండుగ అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో డీన్​విక్రమ్​, ఏఓ నర్సింహచారి, ఈ ఛాంప్స్ ​వీపీ సుష్మ, ఈ కిడ్స్​వీపీ శ్రీలేఖ, ఉపాధ్యాయునులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed