- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మల్లంపల్లిలో అక్రమ వెంచర్
దిశ, వరంగల్ బ్యూరో : ములుగు మండలం మల్లంపల్లిలో నర్సంపేట రోడ్‌లోని హైస్కూల్ ఎదురుగా ఓ అక్రమ వెంచర్ వెలిసింది. సుమారు మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ వెంచర్‌లో ఇప్పటికే కొన్ని ప్లాట్ల విక్రయాలు జరిగినట్లుగా తెలుస్తోంది. నిబంధనలు, అనుమతులతో పని లేదన్నట్లుగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. నాలా కన్వర్షన్ చేయకుండా, డీటీసీపీ అనుమతుల్లేకుండానే పొలం భూమిని గజాల లెక్కన ప్లాటింగ్ చేసి గుంటల లెక్కన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తుండడం గమనార్హం. వ్యాపారుల దందాకు పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖ అధికారుల సహకారం కొనసాగుతోందని తెలుస్తోంది.
ఈ విషయంపై రెవెన్యూ, డీఎల్‌పీవోకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనమతుల్లేకుండా ఏర్పాటు చేసే వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల ములుగు అడిషనల్ కలెక్టర్ వైవీ గణేష్ ప్రకటించారు. గతంలో ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య సైతం రియల్ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అయితే అధికారుల ఆదేశాలను మాత్రం వ్యాపారులు లైట్ తీసుకుంటున్నట్లుగా జరుగుతున్న పరిణామాల ద్వారా స్పష్టమవుతోంది. మల్లంపల్లి వెంచర్‌పై పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుంటారో లేక కలెక్టర్ ఆదేశాలను సైతం తోసి పుచ్చుతారో వేచి చూడాలి.
ఇవీ నిబంధనలు..
లేఅవుట్ వేసేందుకు ముందుగా పంచాయతీ ఆమోదం, నగరాలు, పట్టణాల్లో మున్సిపాల్టీ తీర్మానం చేయాల్సి ఉంది. లేఅవుట్ చేస్తున్న భూమిని భూ మార్పిడి కింద (వ్యవసాయేతర వినియోగం) రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి పొందాలి. ఇందుకు గాను భూమి రిజిస్ట్రేషన్ విలువలో 10 శాతం సొమ్మును రుసుము కింద చెల్లించాలి. పదెకరాల్లో లేఅవుట్ వేస్తే దాని రిజిస్ట్రేషన్ విలువను బట్టి 10 శాతం రుసుము ఉంటుంది. ఉదాహరణకు ఎకరా రూ.30 లక్షలకు రిజిస్ట్రేషన్ చేయిస్తే రూ.3 లక్షలు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. లేఅవుట్‌కు పట్టణ ప్రణాళిక విభాగం సంచాలకుడి అనుమతి పొందాలి.
లేఅవుట్ మొత్తం విస్తీర్ణంలో 10 శాతం స్థలాన్ని ప్రజోపయోగానికి వదిలివేయాలి. గ్రామ పంచాయతీ అయితే పంచాయతీకి, పట్టణాల్లో అయితే మున్సిపాల్టీలకు రిజిస్ట్రేషన్ చేయించాలి. అనుమతి పొందిన లేఅవుట్‌లో ప్రణాళికా విభాగం సూచించిన స్థలాన్నే ప్రజోపయోగానికి వదిలి వేయాలి. ఈ స్థలాల్లో సామాజిక భవనం, పాఠశాలలు, పార్కులు తదితర నిర్మాణాలు చేపట్టే వీలుంటుంది. కానీ ఎక్కడా వీటిని పాటించడం లేదు.