కాంగ్రెస్ పాలనలో ఆకలి బతుకులే.. : చల్లా ధర్మారెడ్డి

by Aamani |
కాంగ్రెస్ పాలనలో ఆకలి బతుకులే.. : చల్లా ధర్మారెడ్డి
X

దిశ, హనుమకొండ టౌన్ : కాంగ్రెస్ పాలనలో ఆకలి బతుకులేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం నడికుడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అరవై ఏండ్ల కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే పేదల బాధలను, పేదల కడుపును నింపాలని, రైతులకు పొలాలకు నీరివ్వాలని ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఏనాడూ రాలేదన్నారు. తెలంగాణను నాశనం చేశారన్నారు. మళ్లీ ఎన్నికలు రాగానే కాంగ్రెస్‌ అధికారం కోసం మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, బీజేపీ పార్టీల తెలంగాణలో అడ్రస్ లేకుండా పోతాయన్నారు.

నేడు తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తేనే సాధ్యమవుతుందన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచన చేయాలి గత పది ఏండ్ల ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో గమనించాలి. పనిచేసే వారికి పట్టం కట్టాలని కోరారు. పరకాల నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నాం అందులో నిర్మానవుతున్న కంపెనీలలో నియోజకవర్గంలో యువతకు, మహిళలకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో మొదటి బాలెట్ లో మూడో నెంబర్ పైన ఉన్న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్థులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed