- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
దిశ, హనుమకొండ : హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మామునూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఆర్గనైజర్స్ ని, విటుడును టాస్క్ ఫోర్స్, మామునూర్ పోలీసులు సంయుక్తంగా రైడ్ నిర్వహించి అరెస్టు చేశారు. వివరాల లోకి వెళ్ళగా మామునూరు, హనుమాన్ నగర్ కు చెందిన పెరుమండ్ల రాజీవ్ ఇల్లు కిరాయికి తీసుకొని ఇతర జిల్లాల నుంచి మహిళలను రప్పించి గత సంవత్సరం నుండి అత్యంత రహస్యంగా వ్యభిచారం చేయిస్తుంన్నాడు. ఈ క్రమంలో మంగళవారం హన్మకొండ జిల్లా శాయంపేట కు చెందిన వ్యక్తి మహిళతో ఒప్పందము కుదుర్చుకొని వ్యభిచారం చేస్తుండగా టాస్క్ ఫోర్స్, మామునూర్ పోలీసులు రైడ్ చేసి బాధిత మహిళలను కాపాడి, అర్గనైజర్స్ అయిన పెరుమాండ్ల రాజీవ్, ఇస్లావత్ సునీత లను తదుపరి విచారణ నిమిత్తం మామునూర్ పోలీసులకు అప్పగించారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ.మధుసూదన్ మాట్లాడుతూ… ఎవరైనా ఆర్గనైజ్డ్ గా ఏర్పడి మహిళలతో వ్యభిచారం చేయించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటమని తెలిపారు. ఇదే వృత్తిగా చేసుకొని రూములు తీసుకొని వ్యభిచారం చేస్తూ పదే పదే దొరికిన నిర్వాహకులపై పీడీ చట్టము అమలు చేయబడునని హెచ్చరించారు. హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసినందుకు ఇన్స్పెక్టర్ సార్ల రాజు, ఆర్ ఎస్ ఐ భాను ప్రకాష్, సిబ్బంది ని ఏసీపీ అభినందించారు.