- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Palakurti MLA : నిరుపేదల ఆరోగ్య రక్షణే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం
దిశ, రాయపర్తి : పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా, నిరుపేదల ఆరోగ్య రక్షనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో 32 మందికి 8 లక్షల 80 వేల సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజారంజక పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. రాబోవు రోజులలో రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నామని పేరొన్నారు.
ప్రమాదవశాత్తు గాయపడి మెరుగైన వైద్యం చేయించుకుని ఖర్చుల పాలైన కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధుల ద్వారా ఆ కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు. ఇంకా ఎవరికైనా నిధులు మంజూరు కాకపోతే తన దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షపాతి అని పేదల వైద్యానికి పెద్దపీట వేస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కుతుందన్నారు. ఆమె వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పాలకుర్తి దేవస్థానం కమిటీ చైర్మన్ కృష్ణమాచార్యులు, నాయకులు కృష్ణారెడ్డి, పెండ్లిమహేందర్ రెడ్డి, మాచర్ల ప్రభాకర్ శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు వనజారాణి తదితరులు పాల్గొన్నారు.