- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సభా వేదికను ఫైనల్ చేసిన హరీష్‌రావు

దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న రజతోత్సవ వేడుకల భారీ బహిరంగ సభకు వేదిక ఖరారైంది. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలోని రింగురోడ్డుకు ఆనుకొని ఉన్న స్థలాన్ని ఫైనల్ చేయనున్నారు. సభా స్థలాన్ని పరిశీలించేందుకు ఇటీవల వరంగల్‌కు వచ్చిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు శుక్రవారం రెండో సారి వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉనికిచర్ల ప్రాంతంలోని సభా వేదిక స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని. నరేందర్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరవనున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా ఉండేలా చూడాలని ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులకు, పార్టీ శ్రేణులకు హరీష్ రావు సూచించారు.